తమన్నా ‘ది వీవాన్’ బాలీవుడ్ మూవీ టీజర్.. బెల్లంకొండ సినిమాల మాదిరిగా ఉందేంటి
ABN , Publish Date - Aug 25 , 2026 | 09:16 PM
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా జంటగా రూపొందుతున్న నూతన బాలీవుడ్ చిత్రం ‘‘ది వీవాన్’ .
సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), తమన్నా (Tamannaah Bhatia) జంటగా రూపొందుతున్న నూతన బాలీవుడ్ చిత్రం ‘‘ది వీవాన్’ (The VVAAN) దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాభ్ కుమార్ కథను అందించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, అరుణాభ్ కుమార్, నీరజ్ కొఠారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ పథ్యంలో తాజాగా మంగళవారం ఆగస్టు 25న ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
'సూర్యాస్తమయం తర్వాత ఎక్కడికి వెళ్లడం నిషిద్ధమో.. కథ అక్కడి నుంచే మొదలవుతుంది' సెప్టెంబర్ 25న ఆ గర్జన వినిపించబోతోంది' అంటూ కొత్త వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ‘ది వీవాన్’ ఎవరు? అతడు శతాబ్దాలుగా దేని కోసం ఎదురుచూస్తున్నాడు? అనే ప్రశ్నలకు టీజర్‌లో సమాధానం దొరుకుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇందులో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, సోనియా అన్ను కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే.. కొత్తగా విడుదల చేసిన ఈ టీజర్‌ను చూశాక ఎప్పుడో, ఎక్కడో ఇలాంటిదేదో సినమా చూసిన అనుమానాలు ప్రతి ఒక్కరికీ రాక మానదు. తెలుగులో గతంలో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం, త్వరలో విడుదల కానున్న హైందవ సినిమాల రిఫరెన్సులు అధికంగా గోచరించాయి. అంతేగాక ఆమధ్య బాలీవుడ్ నుంచి వచ్చిన హర్రర్ ఛాయలు సైతం ఎక్కువగానే కనిసిస్తన్నాయి. ట్రైలర్ విడుదలైతే గానీ ఈ సినిమాపై ఓ అంచనా ఏర్పడే అవకాశం ఉంది.