Shilpa Shetty: శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్.. క్యూ కట్టిన కోటీశ్వరులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:21 PM
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శిల్పా శెట్టి నటిగానే కాకుండా బిజినెస్ విమెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శిల్పా శెట్టి నటిగానే కాకుండా బిజినెస్ విమెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై బాంద్రాలో ఆమెకు బాస్టియన్ అనే ఒక లగ్జరీ రెస్టారెంట్ ఉండేది. గతేడాది కొన్ని కారణాల వలన ఆ రెస్టారెంట్ ను శిల్పా మూసివేసింది. అప్పుడే ఆమె త్వరలోనే సరికొత్త రెస్టారెంట్ తో ప్రజల ముందుకు వస్తానని చెప్పింది. చెప్పినట్లే శిల్పా శెట్టి బాంద్రాలో మరో కొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ కి అమ్మ కాయ్ అనే పేరును పెట్టింది.
అమ్మ కాయ్ రెస్టారెంట్ లాంచ్ సందర్భంగా శిల్పా శెట్టి రిపబ్లిక్ డే న ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ణీత సమయంలో ఎంత మంది వచ్చినా వారికి ఉచిత అల్పాహారం అందిస్తామని తెలిపింది. అంతే.. ఆ విషయం తెలియడంతోప్రజలు రెస్టారెంట్ ముందు బారులు తీరారు. సామాన్యులు మాత్రమే కాకుండా బాంద్రాలో నివసించే కోటీశ్వరులు కూడా ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ కోసం క్యూలో నిలబడడం విశేషం. రెస్టారెంట్ తెరిచే సమయానికి రెండు గంటల ముందుగానే వచ్చి అర కిలోమీటరు లైన్ లో నిలబడ్డారు.
బారులు తీరిన జనాన్ని చూసి సిబ్బంది ఖంగుతిన్నారు. 11.30 గంటల తరువాత వచ్చినవారికి టిఫిన్ పెట్టడానికి సిబ్బంది నిరాకరించడంతో వారు అసహనంతో వెనుతిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కోటీశ్వరులు కూడా ఫ్రీ అంటే ఎగబడుతున్నారు. అది మనిషి నైజం అని కొందరు.. ఏదైనా ఉచితంగా ఇస్తే, ప్రజలు తమ నైతిక విలువలను వదులుకోవడానికి కూడా వెనుకాడరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.