రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఆస్తి.. అయినా నంబర్ వన్

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:23 AM

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరోసారి దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా నిలిచారు.

Shah Rukh Khan

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 (Hurun India Rich List 2026) నివేదిక ప్రకారం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే రూ. 2,490 కోట్లు తగ్గి, ప్రస్తుతం రూ. 10,000 కోట్లకు చేరింది.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కేకేఆర్ వంటి వ్యాపారాల్లో వాటాలు కలిగిన ఆయన, సంపద తగ్గినప్పటికీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రూ. 4,000 కోట్లతో రెండో స్థానంలో, సల్మాన్ ఖాన్ (Salman Khan) రూ. 3,000 కోట్లతో మూడో స్థానంలో, హృతిక్ రోషన్ (Hrithik Roshan) రూ. 2,500 కోట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:49 AM