‘కేడీ: ది డెవిల్’ సాంగ్ వివాదం.. కేంద్రం ఆదేశాలతో యూట్యూబ్ నుంచి తొలగింపు
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:26 PM
ధ్రువ్ సర్జా కథానాయకుడిగా నటించిన కేడీ: ది డెవిల్’లోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. అ
ధ్రువ్ సర్జా (Dhruva sarja) కథానాయకుడిగా నటించిన కేడీ: ది డెవిల్’లోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటలో నోరా ఫతేహి, సంజయ్ దత్ ఆడిపాడారు. ప్రచారంలో భాగంగాఈ సాంగ్‌ను హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో ఆదివారం విడుదల చేశారు. హిందీ సాంగ్ లో లిరిక్స్ వినదగినట్లు లేవని, సాహిత్యం అసభ్యపదజాలంతో నిండిపోయిందని, డాన్స్ మూమెంట్స్ కూడా అసభ్యంగా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దాంతో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన కేంద్రం అన్ని వేదికల్లోనూ పాటను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ మరెక్కడా కనిపించకుండా చూసుకోవాలని సూచించింది. ఇప్పటికే విడుదలైన పాటను నిర్మాణ సంస్థ సంబంధిత ఆడియో కంపెనీ యూట్యూబ్ నుంచి, ఇతర సోషల్ మీడియా పేజెస్ నుంచి తొలగించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.