Sanskriti : కృష్ణావతారం చిత్రంలో సత్యభామగా సంస్కృతి జయనా!

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:13 PM

ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ మనవరాలు సంస్కృతి జయనా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. రాజకీయ, వ్యాపార నేపథ్యం ఉన్న ఆమె సినిమాల్లోకి రావడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ (Anandiben Patel) మనవరాలు సంస్కృతి జయనా (Sanskriti Jayana) సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. రాజకీయ, వ్యాపార నేపథ్యం ఉన్న ఆమె సినిమాల్లోకి రావడం విశేషం. కమర్షియల్‌ బాలీవుడ్‌ సినిమాతో కాకుండా భక్తి నేపథ్యం ఉన్న పౌరాణిక చిత్రం 'కృష్ణావతారం పార్ట్‌-1: ది హార్ట్‌' (Krishnavataram Part 1 The Heart) చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇందులో ఆమె  శ్రీకృష్ణుని భార్య సత్యభామ పాత్రలో కనిపిస్తున్నారు. కేవలం ఒక పాత్రలా కాకుండా.. ఈ కథ మొత్తం సత్యభామ కోణంలోనే సాగుతుండటం గమనార్హం. ఇందులో సిద్థార్థ్‌ గుప్తా శ్రీకృష్ణుడిగా నటిస్తుండగా.. రాధగా సుస్మితా భట్‌, రుక్మిణిగా నివాసిని కృష్ణన్‌ నటిస్తున్నారు. హార్దిక్‌ గజ్జర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 7న థియేటర్లలో విడుదల కానుంది. నటిగా కృష్ణావతారం ఆమెకు తొలి చిత్రం. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేయగా 3.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.  

సంస్కృతి జయనా నటి మాత్రమే కాదు. సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్త కూడా. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో నటన, నృత్యంలో శిక్షణ పొందారు. 16 ఏళ్ల వయసులోనే తన సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించి జిమ్మీ చూ, బొట్టెగా వెనెటా వంటి గ్లోబల్‌ బ్రాండ్‌లతో కలిసి పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. 

Updated Date - Apr 20 , 2026 | 04:17 PM