Sanjay Leela Bhansali: రిపబ్లిక్ డే పరేడ్‌లో.. సంజయ్ లీలా భన్సాలీ శకటం

ABN , Publish Date - Jan 23 , 2026 | 08:47 AM

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు 'మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్' సంజయ్ లీలా భన్సాలీకి అత్యంత అరు దైన గౌరవం దక్కింది.

Sanjay Leela Bhansali

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు 'మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్' సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. జనవరి 26న న్యూఢిల్లీ లోని కర్తవ్యపథ్ తో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day Parade) లో భారతీయ సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. 113 ఏళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలోని మజిలీలను, అత్యుత్తమ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఒక ప్రత్యేక శకటాన్ని ఆయన రూపొందించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న‌ రణ్ బీర్ క‌పూర్, ఆలియాభట్ జంటగా 'లవ్ అండ్ వార్' అనే భారీ యుద్ధ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించలేక పోయారు. గత రెండు నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించి ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.

చరిత్రలో.. నిలిచిపోయేలా

భన్సాలీ రూపొందించిన ఈ శకటం, భారతీయ సినిమా 113 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని సమాచారం. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, ప్రాంతీయ భాషా చిత్రాల గొప్పతనాన్ని కూడా ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఒక దర్శకుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇలాంటి ప్రదర్శనను రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారతీయ సినిమా గర్వించదగ్గ క్షణాలను ఒకే చోట ఆవిష్కరించే అవకాశం కావడంతో భన్సాలీ ఈ బాధ్యతను స్వీకరించినట్లు ఆయన టీమ్ తెలిపింది.

Updated Date - Jan 23 , 2026 | 03:22 PM