Sanjay Leela Bhansali: ‘లవ్ అండ్ వార్’ తర్వాత భన్సాలీ బయోపిక్ ప్లాన్..

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:37 PM

సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. 'లవ్ అండ్ వార్' చిత్రం తర్వాత ఆయన చేసే సినిమా ఏంటో తెలిపారు.

బాలీవుడ్ లో కథా బలమున్న చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali). 'గంగూబాయి కతియావాడి' చిత్రం  తర్వాత నాలుగేళ్ళ గ్యాప్  తీసుకున్న  ఆయన ఈ ఏడాది నిర్మాతగా  'ధో దీవానే షెహర్ మే' చిత్రాన్ని తెరకెక్కించారు.  ఇప్పుడు ఆయన  'లవ్ అండ్ వార్’ సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  ముంబైలోని గోరేగావ్ రాయల్ పామ్స్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ‘లవ్ అండ్ వార్’ షూటింగ్ పూర్తవగానే అదే లొకేషన్‌లో మరో ఆసక్తికరమైన సినిమా కోసం ఏర్పాట్లు మొదలుకానున్నాయి.

madhu bala.jfif

బాలీవుడ్ దిగ్గజ నటి మధుబాల జీవిత కథ ఆధారంగా భన్సాలీ తెరకెక్కించనున్న బయోపిక్ కోసం రాయల్ పామ్స్‌ను ప్రత్యేకంగా మార్చనున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం అక్కడ భారీ సెట్స్ సిద్ధం చేయనున్నారట. మధుబాల పాత్రలో సారా అర్జున్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు  .వచ్చాయి. చిన్న వయసులోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్.. ఇప్పుడు ఇంతటి ప్రతిష్టాత్మకమైన బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషించనుండటం ఆసక్తిని పెంచుతోంది. మధుబాల లాంటి ఐకానిక్ నటిని తెరపై ఆవిష్కరించేందుకు భన్సాలీ ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. **సెప్టెంబర్‌లో మధుబాల బయోపిక్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Updated Date - Aug 22 , 2026 | 02:36 PM