స‌ల్మాన్ ఖాన్.. షాకింగ్ డెసిషన్! ఆస్తుల.. పంప‌కం

ABN , Publish Date - Apr 04 , 2026 | 08:53 PM

గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో వండర్స్ క్రియేట్‌ చేయడం లేదు. అయినా అతన్ని అభిమానించే వారు కోట్లలో ఉన్నారు. అలాంటి సల్మాన్‌ ఉన్నట్టుండి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ డెసిషన్ గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.

Salmankhan

బాలీవుడ్‌లోని స్టార్ హీరో ఒకరు తన సంపదను కుటుంబ సభ్యులకు పంచివేయాలనే ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్న విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన తన ఆస్తులను సోదర, సోదరీమణులకు సమానంగా ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డెసిషన్ విన్నవారంతా ఉన్నట్టుండి ఇంత డబ్బును ఎందుకు ఇలా పంచేయాలనుకున్నాడని షాక్ అవుతున్నారు.


ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఆ హీరో గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన అనారోగ్యమేనని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో ఆయన తాను 'ట్రైజెమినల్ న్యూరల్జియా' అనే అరుదైన నరాల వ్యాధితో బాధపడిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ వ్యాధి వల్ల ముఖంలో ఎలక్ట్రిక్ షాక్ లాంటి భయంకర నొప్పులు వచ్చి, ఒక దశలో ఆత్మహత్య ఆలోచన వరకు వెళ్లానని కూడా చెప్పుకున్నాడు. 'సూసైడ్ డిసీజ్'గా పిలవబడే ఈ సమస్యకు లండన్‌లో ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నట్లు వెల్లడించాడు.

ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో సినిమాలు చేస్తున్నా, తన తర్వాత కుటుంబం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడే ఆస్తి పంపకాలు పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది. కుటుంబం పట్ల ఆయనకున్న లోతైన ప్రేమను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ టాప్‌ స్టార్ హీరో ఎవరో కాదు సల్మాన్ అంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మరి ఇందులోని నిజానిజాలేమిటనేది ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

Updated Date - Apr 04 , 2026 | 10:51 PM