Salman khan: కొత్త ఇంటికి షిఫ్ట్ కానున్న సల్మాన్
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:29 PM
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ (Salman khan) జీవితంలో ఒక పెద్ద మార్పు రానుందని బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆయన ఇల్లు మారబోతున్నారట.
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ (Salman khan) జీవితంలో ఒక పెద్ద మార్పు రానుందని బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆయన ఇల్లు మారబోతున్నారట. 52 ఏళ్లుగా ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో (Galaxy) ఉంటున్న సల్మాన్ కుటుంబం త్వరలో కొత్త ఇంటికి మారనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ బాంద్రాలోని చింబై ప్రాంతంలో ఖాన్ కుటుంబానికి చెందిన స్థలంలో సముద్రతీరాన విలాసవంతమైన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఇంటి నిర్మాణం కూడా మొదలైంది. రూ.350 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల భవంతిని నిర్మిస్తున్నారు సల్మాన్.
సల్మాన్ నిర్మిస్తున్న ఈ ఇల్లు షారుక్‌ఖాన్ హౌస్ మన్నత్‌ను మించి ఉంటుందని టాక్. ఇందులో జిమ్, పూల్స్ అన్ని సౌకర్యాలతో సల్మాన్ లైఫ్‌స్టైల్‌కు, అభిరుచికి తగ్గట్లు ఉంటుందని తెలిసింది. భద్రత విషయంలోనూ కట్టుదిట్టంగా ఉంటుందట. ఈ ఇల్లు పూర్తికాగానే సల్మాన్ కుటుంబం కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. కొత్త ఇంటికి మారినా గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సల్మాన్‌కు ఉన్న అనుబంధః మాత్రం ప్రత్యేకంగానే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే గెలాక్సీ ఖాన్‌కు ఓ ఎమోషన్. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి.