సల్మాన్‌ఖాన్‌.. వంశీ పైడిపల్లి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:31 PM

  సల్మాన్‌ ఖాన్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్‌ రాజు ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! నయనతార ఈ చిత్రంలో కథానాయిక.

సల్మాన్‌ ఖాన్‌(Salman khan), వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) కాంబినేషన్‌లో దిల్‌ రాజు (Dil Raju) ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! నయనతార ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రం షూటింగ్‌ శనివారం ముంబైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 63వ చిత్రంగా భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో రూపొందుతోంది. ముంబైలో వేసిన భారీ సెట్‌లో హై-ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. నెల రోజులపాటు ఈ షెడ్యూల్‌ జరుగనుంది. ఇందులో కీలక సన్నివేశాల కోసం నయనతార శనివారం సెట్‌లో అడుగుపెట్టారు. సల్మాన్‌, నయన్‌ జోడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని వంశీ పైడిపల్లి చెబుతున్నారు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు తెలిపారు.  ‘సల్మాన్‌ ఖాన్‌ వంశీ పైడిపల్లి ఫిల్మ్‌... ఈరోజు మొదలైంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Updated Date - Apr 18 , 2026 | 06:31 PM