Ek Din: ఫ్లాప్ అన్నారు కదరా.. ఓటీటీలో అదరగొడుతుందేంటీ

ABN , Publish Date - Jul 22 , 2026 | 07:59 PM

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అయినా ఓటీటీలో ప్లాప్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో భారీ డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం హిట్ కొడుతున్నాయి. తాజాగా ఏక్ దిన్ (Ek Din) రెండో కేటగిరీలో చేరింది.

Ek Din

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అయినా ఓటీటీలో ప్లాప్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో భారీ డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం హిట్ కొడుతున్నాయి. తాజాగా ఏక్ దిన్ (Ek Din) రెండో కేటగిరీలో చేరింది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) జంటగా నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఏక్ దిన్. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1 న రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ ని మూటకట్టుకుంది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీనే ప్లాప్ తో మొదలయ్యింది.


ఇక ఈ మధ్యనే ఏక దిన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్ లో ప్లాప్ అయిన సినిమా ఓటీటీలో ఎవరు చూస్తారులే అనుకున్నారు.. కానీ, ఈ సినిమా మాత్రం అనూహ్యమైన స్పందనను దక్కించుకుంటూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఓటీటీ డిజిటల్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో మరోసారి మాయ చేసింది. ఒక్క రోజు మాత్రమే జ్ఞాపకశక్తిని కోల్పోయే మీరా పాత్రలో ఆమె చూపించిన హావభావాలు, ఎమోషన్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. జునైద్ ఖాన్ నటన కూడా బాగున్నప్పటికీ, సాయి పల్లవి తన వన్-మన్ షోతో మొత్తం సినిమాను నడిపించిందని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఏక్ దిన్ సినిమాలోని సాయి పల్లవి నటనకు సంబంధించిన వీడియో క్లిప్స్, ఎమోషనల్ సీన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్స్.. ప్లాప్ అన్నారు కదారా.. ఇప్పుడేంటి బావుంది అంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో అయినా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

Updated Date - Jul 22 , 2026 | 08:23 PM