Ek Din Teaser: సాయిపల్లవి- జునైద్ మ్యాజిక్ లవ్.. టీజర్ భలే ఉందే
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:15 PM
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) నట వారసుడిగా మహారాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు జునైద్ ఖాన్ (Junaid Khan). ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Ek Din Teaser: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) నట వారసుడిగా మహారాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు జునైద్ ఖాన్ (Junaid Khan). ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత లవ్ టుడే రీమేక్ గా తెరకెక్కిన లవ్ యాపాలో హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. జునైద్ ని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని ఆమీర్ తహతహలాడుతున్నాడు. దీనికోసం కొడుకు సినిమాలను తన బ్యానర్ లోనే నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్.
ఢిల్లీ బెల్లి, లాల్ సింగ్ చద్దా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సునీల్ పాండే ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఈ సినిమాతో సాయిపల్లవి.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. రామాయణలో కూడా ఆమె నటిస్తుంది. దానికన్నా ముందే ఏక్ దిం రిలీజ్ కు సిద్దమవుతుండడంతో ఇదే ఆమె డెబ్యూ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఏక్ దిన్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదొక అద్భుతమైన లవ్ స్టోరీలా కనిపిస్తుంది. కథ మొత్తాన్ని రివీల్ చేయకపోయినా.. జునైద్ - సాయిపల్లవిల మధ్య ఉన్న లవ్ ని చూపించారు. కొన్ని ప్రేమ కథలకు కాలంతో పనిలేదు అనే క్యాప్షన్ తో టీజర్ మొదలయ్యింది. సినిమా మొత్తం మంచు ప్రదేశాలలోనే షూట్ చేసినట్టు తెలుస్తోంది. సాయిపల్లవి లుక్ అదిరిపోయింది. ఆమెనే ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా వన్ డే అనే థాయ్ సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంత అనేది తెలియాలంటే మే 1 న సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.