రూ.30వేల కోట్ల ఆస్తి.. కరిష్మా కపూర్‌ సంతానానికి ఊరట

ABN , Publish Date - May 01 , 2026 | 06:17 AM

దివంగత వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్ ఆస్తులను పరిరక్షించాలని, విక్రయించరాదని ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశించింది.

Karisma Kapoor

దివంగత వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్ (Sunjay Kapur) ఆస్తులను పరిరక్షించాలని, విక్రయించరాదని ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇది ప్రముఖ నటి కరిష్మా కపూర్ (Karisma Kapoor) సంతానానికి ఊరట కలిగించేలా ఉంది. రూ.30వేల కోట్ల ఎస్టేట్‌కు యజమాని అయిన సంజయ్‌ కపూర్‌ గత ఏడాది జూన్‌లో లండన్‌లో మరణించారు.

ఆస్తుల విషయమై ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవ కపూర్ (Priya Sachdev), రెండో భార్య అయిన కరిష్మా కపూర్‌ సంతానం మధ్య వివాదం నెలకొంది. మొత్తం ఆస్తుల వివరాలను ప్రియా కపూర్‌ వెల్లడించలేదని పేర్కొంటూ కరిష్మా పిల్లలు కియాన్‌, సమీరా కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆస్తులను విక్రయుంచకూడదంటూ ప్రియా కపూర్‌ను కోర్టు ఆదేశించింది. సంజయ్‌ కపూర్‌ బ్యాంకు ఖాతా నిర్వహణపైనా ఆంక్షలు విధించింది.

Updated Date - May 01 , 2026 | 06:50 AM