Rashmika Mandanna: హయ్యస్ట్.. బెస్ట్ టాక్స్ పేయర్ 'రష్మిక మందన్న'! ఎంత పన్ను కట్టిందో తెలుసా
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:12 PM
రష్మిక మందన్న తన విజయాల జాబితాలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తిగా ఆమె నిలిచింది.
నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ మూడు త్రైమాసికాలకు కలిపి ఆమె ఏకంగా రూ. 4.69 కోట్ల రూపాయల ఆదయపన్ను చెల్లించినట్టు తెలుస్తోంది. ఆమె నివసిస్తున్న కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపన్ను చెల్లించిన వ్యక్తిగా రశ్మిక నిలిచింది.
గత యేడాది రశ్మిక మందణ్ణ హిందీలో మూడు సినిమాలు తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అందులో ఛావా (Chhaava) ఘన విజయాన్ని సాధించగా, 'సికందర్, తమ్మా' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అలానే తెలుగులో నటించిన 'కుబేర, ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాలు ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేదు. అయితే నటిగా ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. గత కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్ గా ఉన్న రశ్మిక స్థిరాస్థుల్ని బాగానే సంపాదించుకుంది.
సొంత జిల్లా కొడగులో రశ్మిక కు బంగ్లా ఉంది. అలానే బెంగళూరులో రూ. ఎనిమిది కోట్లు ఖరీదు చేసే ఇల్లు ఉంది. ఇవే కాకుండా హైదరాబాద్, గోవా, కూర్గ్ లోనూ ఆమెకు స్థిరాస్థులు ఉన్నాయట. ముంబై వర్లీలోని అహూజా టవర్స్ లోనూ లగ్జరీ అపార్ట్ మెంట్ ను ఇటీవల రశ్మిక కొనుగోలు చేసిందని చెబుతుంటారు. ప్రస్తుతం రశ్మిక తెలుగులో 'మైసా'తో పాటు హిందీలో 'కాక్ టయిల్ 2'లో నటిస్తోంది. అలానే 'పుష్ప 3' మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. గత యేడాది విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరగ్గా ఈ యేడాది వారు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు రూ 9 కోట్ల నుండి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రశ్మిక పలు ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తోంది.