Pralay: దురంధరుడితో.. లోకా! కాంబినేషన్ అదిరింది
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:20 PM
రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్ పేరు వినిపిస్తోంది. పూర్తి వివరాలు…
గత సంవత్సరం జాతీయంగా, అయా ఇండస్ట్రీల పరంగా చరిత్రలను తిరగరాసి, కొత్త రికార్డులు నెలకొల్పాయి లోకా, దురంధర్ చిత్రాలు. ఈ నేపథ్యంలోనే 2025లో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఇద్దరు నటులు ఒకే ప్రాజెక్ట్‌లో కలిస్తే ఆ వార్తకు నేషనల్ మీడియాలో భారీ హైప్ రావడం సహజం. ప్రస్తుతం అలాంటి బజ్‌నే క్రియేట్ చేస్తోంది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh), సౌత్ సెన్సేషన్ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ల కాంబినేషన్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న జాంబీ థ్రిల్లర్ (Zombie Film) ‘ప్రళయ్’ (Pralay) సినిమాలో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్ పేరు కరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జై మేహత దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గామారింది.

ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ (Dhurandhar) ఘనవిజయం సాధించడంతో రణవీర్ సింగ్ తన కెరీర్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని టాక్. ఇప్పటికే ప్రకటించిన ‘డాన్ 3’ని కొంతకాలం పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే జాంబీ జానర్‌లో తెరకెక్కుతున్న ‘ప్రళయ్’పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ‘లోకా: చాప్టర్ 1’ (Lokah Chapter 1) కల్యాణి ప్రియదర్శన్ కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆమె నటనకు మంచి రివ్యూస్ రావడంతో పాటు, సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నటనకు స్కోప్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న కల్యాణికి, ‘ప్రళయ్’ లాంటి సినిమా బాలీవుడ్ ఎంట్రీకి మంచి అవకాశంగా మారవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే.. ‘ప్రళయ్’ సినిమా కోసం బాలీవుడ్, సౌత్ నుంచి పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్ చివరికి ‘లోకా: చాప్టర్ 1’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కల్యాణిపైనే ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఆ సినిమాలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించిన విజయం ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. తమ తమ ఇండస్ట్రీల్లో మంచి హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సమయంలో రణవీర్ సింగ్ – కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్ నిజమైతే, ‘ప్రళయ్’పై హైప్ మరింత పెరగడం ఖాయం. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే.. ఇప్పటికే చాలా మంది నెటిజన్లు రంగంలోకి దిగి వీరిద్దరి పోస్టర్లతో సోషల్ మీడియాలో పెద్ద హంగామానే సృష్టిస్తున్నారు.