Ranveer Singh: లలిత్ మోదీ బయోపిక్‌లో రణ్‌వీర్
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:42 PM
రణ్ వీర్ సింగ్ మరోసారి ధురందర్ కాబోతున్నాడా? మరోసారి దావూద్ ఇబ్రహీంతో కలవబోతున్నాడా? అంటే అవునే అనిపిస్తోంది.
రణ్ వీర్ సింగ్ మరోసారి ధురందర్ కాబోతున్నాడా? మరోసారి దావూద్ ఇబ్రహీంతో కలవబోతున్నాడా? అంటే అవునే అనిపిస్తోంది. అప్ కమింగ్ మూవీ కోసం మరోసారి మోస్ట్ డేంజరస్ క్రిమినల్ తో మాట్లాడబోతున్నాడన్న న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఈ సినిమా ఏంటి? మళ్ళీ ఆ అవసరం ఏమొచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ ఐపీఎల్ సృష్టికర్త.. మాజీ కమిషనర్ లలిత్ మోదీ జీవితం ఆధారంగా భారీ బయోపిక్ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను సోనీ సంస్థ మాజీ అధినేత్రి స్నేహా రజని నేతృత్వంలోని బృందం వందలాది ఇంటర్వ్యూలు, భారీ పరిశోధనలతో సిద్ధం చేస్తోంది. తన వ్యాపార ప్రస్థానం, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ , వివాదాలను కేంద్రంగా చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని లలిత్ మోదీ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కీ రోల్ లో నటించే హీరో విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
లలిత్ మోదీ పాత్రను పోషించడానికి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు మోదీ బయటపెట్టారు. రెండేళ్ళ క్రితం లండన్‌లోని తన నివాసానికి వచ్చి కలసిన రణ్‌వీర్, తన కెరీర్‌లో అత్యంత సెన్సేషనల్ రోల్ లలిత్ మోదీ పాత్ర అని చెప్పారట. 'ధురంధర్'లో అతని నటన అద్వితీయమని కొనియాడిన మోదీ, ప్రస్తుతం రణ్‌వీర్ పెద్ద స్టార్ కావడంతో డేట్స్ సర్దుబాటు ఆధారంగా ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో చూడాలని చెప్పుకొచ్చారు.
మరోవైపు తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకోవడానికి వెనుక ఓ సంచలన విషయాన్ని లలిత్ మోదీ బయటపెట్టారు. అండర్‌వరల్డ్ బెదిరింపులే ప్రధాన కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2012లో లండన్‌లో అర్ధరాత్రి ఒక మధ్యవర్తి ద్వారా దావుద్ సిండికేట్ వ్యక్తులు ఫ్రాంచైజీ కేటాయించాలని ఒత్తిడి చేశారని.. ఆ సమయంలో దావుద్‌తో స్పీకర్ ఫోన్‌లో మాట్లాడించే ప్రయత్నం జరిగిందని చెప్పారు.
ఆ తర్వాత దీర్ఘకాలం అంతర్జాతీయ రక్షణల మధ్య జీవించాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తానికి లలిత్ మోదీ బయోపిక్ లో అండర్ వరల్డ్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఈ సినిమాకు ఉండటం, అది ఆయనే స్వయంగా బయటపెట్టడం మరింత ఆసక్తిని పెంచుతోంది . చూడాలి మరి ఏం జరుగుతుందో.