Mardaani 3: బెగ్గర్ మాఫియా, అమ్మాయిల మిస్సింగ్.. రాణీ ముఖర్జీ న్యూ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:46 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ (Rani Mukerji) కాస్త గ్యాప్ తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ (Rani Mukerji) కాస్త గ్యాప్ తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి మంచి విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మర్ధాని సినిమా సిరీస్‌లో 3వ పార్ట్ మర్ధాని 3 (Mardaani 3) త్వరలో విడుదలకు సిద్ధమైంది. అంతుపట్టని హత్యలు, మిస్సింగ్స్ వెనుక రహాస్యాలను బయట పెట్టడం ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే నేపథ్యంలో సినిమా మంచి థ్రిల్‌ను పంచుతూ సాగనుంది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే.. బెగ్గర్ మాఫియా, ఆడ పిల్లల కిడ్నాపులు వాటి వెనకాల ఉన్న అమ్మ అనే మహిళ చేసే దురాగతాలు అన్నీ వెన్నులో వణికే పుట్టించేలా ఉన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాకు అభిరాజ్ మినావాల (Abhiraj Minawala) దర్శకత్వం వహించగా జంకీ బోడీవాలా (Janki Bodiwala), మల్లికా ప్రసాద్ (Mallika Prasad) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం జనవరి 30న హిందీలో మాత్రమే రిలీజ్ కానుంది.