అబ్బా.. టాలీవుడ్ గురించి ఎంత గొప్పగా చెప్పావ్ రకుల్
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:23 PM
తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా కెరీర్ నిర్మించుకుని, స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత చాలా మంది నటీమణులు బాలీవుడ్‌కు వెళ్లి.. తమకు మొదటి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో ఏరు దాటాక తెప్ప తగలేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా కెరీర్ నిర్మించుకుని, స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత చాలా మంది నటీమణులు బాలీవుడ్‌కు వెళ్లి.. తమకు మొదటి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో ఏరు దాటాక తెప్ప తగలేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకొని.. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ టాలీవుడ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం చాలామంది హీరోయిన్స్ కి ఫ్యాషన్ గా మారింది. తాప్సీ, తమన్నా లాంటి హీరోయిన్లు ఎన్నోసార్లు టాలీవుడ్ ని కించపరిచి మాట్లాడారు. అలాంటివారందరికీ హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గట్టి కౌంటర్ ఇచ్చింది. టాలీవుడ్ గురించి ఆమె చెప్పిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాయి.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ఒక ప్రొఫెషనల్‌గా తన ఎదుగుదల అంతా టాలీవుడ్ పరిశ్రమలోనే జరిగిందని గర్వంగా చెప్పుకొచ్చింది. 'బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఐక్యంగా ఉంటుంది. ఒకరికొకరు ఎంతో సపోర్ట్ చేసుకుంటారు. టాలీవుడ్‌లో ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఇక్కడి మేకర్స్ ఒకరి సినిమాలను, ట్రైలర్లను, ప్రమోషనల్ ఈవెంట్లను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా సపోర్ట్ చేసుకుంటూ పరస్పర విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారని' చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా బాలీవుడ్‌పై రకుల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముంబై ఇండస్ట్రీలో ఇలాంటి ఐక్యత, సపోర్ట్ అస్సలు కనిపించవని, అక్కడ నటీనటుల మధ్య ఉండే తీవ్రమైన అభద్రతా భావం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా అడ్డుపడుతుందని ఆమె ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, బాలీవుడ్‌లో ప్రస్తుతం నెగిటివ్ పీఆర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందని, దానిని గనుక పక్కన పెడితే బాలీవుడ్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తుందని రకుల్ తెలిపింది. బాలీవుడ్ అంతా ఒక కుటుంబంలా ఐక్యంగా ఉంటే, అది మరింత బలమైన పరిశ్రమగా ఎదుగుతుందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌ను ఆకాశానికెత్తుతూ, బాలీవుడ్ ఇన్ సెక్యూరిటీస్ ను బయటపెట్టిన రకుల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రకుల్ ని చూసి మిగిలిన హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.