క్రిష్‌తో విన్యాసాలకు సిద్ధమేనా..
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:28 AM
ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో సినిమా చేయనుందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. హిందీలో ఆమె కమ్‌బ్యాక్ ‘క్రిష్ 4’ అని టాక్ నడుస్తోంది.
గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తోంది. ‘ది స్కై ఈజ్ పింక్’, ‘వి ఆర్ వన్ ఫ్యామిలీ’ చిత్రాల తర్వాత హిందీలో ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. వరుసగా ఇంగ్లిష్ చిత్రాలు, సిరీస్‌లలోనే నటించింది ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో సినిమా చేయనుందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. హిందీలో ఆమె కమ్‌బ్యాక్ ‘క్రిష్ 4’ అని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘క్రిష్ 4’లో (krrish 4)నటించడానికి ప్రియాంక అంగీకారం తెలిపిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. తిరిగి బాలీవుడ్ సినిమాల్లోకి రావడానికి ఆమె ఎంతో ఉత్సాహంగా ఉందని టాక్ నడుస్తోంది.

బాలీవుడ్ యాక్షన్‌స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. దర్శకుడిగా హృతిక్‌కు తొలి సినిమా ఇది. అంతరిక్ష నేపథ్యం, టైమ్ ట్రావెల్ ఇతివృత్తంతో ఈ సినిమా ఉండనుందని, ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. ఇంతకు ముందు వచ్చిన క్రిష్ సిరీస్ చిత్రాల్లో కూడా ప్రియాంక చోప్రానే కథానాయిక. ఆమె అయితేనే ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఈ సినిమా ప్రకటన సందర్భంలో వెల్లడించారు.