Prateik Smita Patil: ఇండస్ట్రీలో పెళ్లి ఒక జోక్.. 90 శాతం ఫేక్
ABN , Publish Date - Feb 06 , 2026 | 05:10 PM
న్యాచురల్ స్టార్ నాని (Nani), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) జంటగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం హిట్ 3 (Hit 3).
Prateik Smita Patil: న్యాచురల్ స్టార్ నాని (Nani), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) జంటగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం హిట్ 3 (Hit 3). గతేడాది రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ స్మితా పాటిల్ (Prateik Smita Patil) విలన్ గా నటించాడు. అతనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ప్రతీక్.. దివంగత నటి స్మితా పాటిల్ కుమారుడు. హిట్ 3 తరువాత వరుస అవకాశాలను అందుకొంటున్న ప్రతీక్ ఈ మధ్యనే నటి ప్రియా బెనర్జీ (Priya Benerjee)ని రెండో వివాహాం చేసుకున్నాడు.
పెళ్లి తరువాత ప్రతీక్- ప్రియా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వీరు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే వివాహాలు 90 శాతం వరకు ఫేక్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో తామూ ఉన్నాం కాబట్టి నిజం చెప్తున్నామని, ఇక్కడ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా ప్రతీక్ మాట్లాడుతూ.. ' బయట ఉండే ప్రజలకు లోపల ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియవు. అవి ఇండస్ట్రీలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తాయి. ఏదోరోజు అవన్నీ కథ, సినిమా, డాక్యుమెంటరీ రూపంలో ప్రజలకు తెలుస్తాయి.
బాలీవుడ్ లో పెళ్ళిళ్ళు 90 శాతం ఫేక్. వారందరూ పెళ్ళిని జోక్ గా చూస్తారు. రాత్రి అయిపోతే.. విషయం అయ్యినట్టే అని పెళ్ళైనవాళ్ళే చెప్తున్నారు. ఇదంతా మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలిసింది. పెళ్ళి పేరుతో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అదే ఫ్యాషన్ గా మారిపోయింది' అని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్ళికి ముందు తాము ఎన్నో బాధలు అనుభవించామని, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇక్కడవరకు వచ్చామని ప్రియా బెనర్జీ తెలిపింది. ప్రస్తుతం ఈ జంట వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.