ఎన్టీఆర్ విలన్‌గా.. బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి'! ఇప్పుడొస్తుంది.. అసలు మజా
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:59 AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ (Dragon). ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయిందంటూ కొన్ని పుకార్లు షికారు చేసినప్పటికీ, చిత్ర యూనిట్ వాటిని వెంటనే ఖండించింది. షెడ్యూల్స్ మధ్యలో వచ్చే సాధారణ విరామం తప్ప, చిత్రీకరణ అంతా ప్రణాళికాబద్ధంగా, పర్ఫెక్ట్‌గా సాగుతోందని మేకర్స్ స్పష్టతనివ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్రపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత ఎన్టీఆర్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. టోవినో కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపినప్పటికీ, తన ఇతర సినిమాల కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ ఆప్షన్ కోసం వెతుకులాట ప్రారంభించారు.
తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ విలన్‌గా బాలీవుడ్ అర్జున్ రెడ్డి (కబీర్ సింగ్) స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor)ను రంగంలోకి దించేందుకు చర్చలు జరుగుతున్నాయి. షాహిద్ కపూర్‌తో ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగిశాయని, ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, ఎన్టీఆర్ మరియు షాహిద్ కపూర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ వెండితెరపై పెను సంచలనం సృష్టించడం ఖాయం. బాలీవుడ్ మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయంలో అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త రగ్గడ్ ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నారట. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేయడంలో దిట్ట. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ మరియు బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, ఈ లుక్ చూస్తే అభిమానుల మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్‌తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.