పూజా హెగ్డేతో వరుణ్ ధావన్.. నెట్టింట సెగలు రేపుతోన్న రొమాంటిక్ స్టిల్!

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:11 PM

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇప్పుడో హిట్ కావాలి. సౌత్, నార్త్‌లలో కూడా పూజా హెగ్డే పరిస్థితేం బాగోలేదనే విషయం తెలియంది కాదు. ఆమెకు ఒక మంచి హిట్ పడితేనే ఏ ఇండస్ట్రీలోనైనా కొన్నాళ్ల పాటు మళ్లీ చక్రం తిప్పగలదు.

Pooja Hegde and Varun Dhawan

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)కు ఇప్పుడో హిట్ కావాలి. సౌత్, నార్త్‌లలో కూడా పూజా హెగ్డే పరిస్థితేం బాగోలేదనే విషయం తెలియంది కాదు. ఆమెకు ఒక మంచి హిట్ పడితేనే ఏ ఇండస్ట్రీలోనైనా కొన్నాళ్ల పాటు మళ్లీ చక్రం తిప్పగలదు. లేదంటే మాత్రం దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి నెలకొంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి అవకాశాలను కూడా వదులుకున్న పూజా హెగ్డే, ప్రస్తుతం సౌత్, నార్త్‌లతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె నటిస్తోన్న బాలీవుడ్ ఫిల్మ్ ‘హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై’ నుంచి విడుదలైన ఓ పిక్, పూజాను వార్తలలో నిలిచేలా చేస్తోంది.


బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌ (Varun Dhawan) హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai). తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు లీకైన విషయం తెలిసిందే. ఆ వీడియోలలో పూజా, వరుణ్ రొమాంటిక్ మూడ్‌లో కనిపించారు. ఇప్పుడదే సన్నివేశానికి సంబంధించిన పిక్‌ని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. హీరో వరుణ్ ధావన్ ఈ రొమాంటిక్ పిక్‌ని షేర్ చేసి, ‘ప్రేమ ఒక్కసారే పుడుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ఆయన షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.


ఈ పిక్‌లో నది ఒడ్డున ఇసుక తిన్నెలపై వరుణ్ ధావన్ ఒడిలో పూజా హెగ్డే కూర్చుని ఉంది. ఈ ఫొటోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. గతంలో ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయినప్పుడే, ఈ జంట వార్తలలో నిలిచింది. ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చిన ఈ పిక్.. సమ్మర్ హీట్‌ను మరింత పెంచేస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూన్ 5న విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. కానీ, ఇప్పుడు యష్ ‘టాక్సిక్’ కోసం ఒక వారం వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ న్యూ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పూజా, వరుణ్‌ల ఈ పిక్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ, సినిమాను వార్తల్లో ఉంచేలా చేస్తోంది.

Updated Date - Apr 07 , 2026 | 06:11 PM