చూపే.. కరువైంది కదా! మిల్కీ బ్యూటీ.. ఎఫర్ట్ అంతా బాలీవుడ్ పైనే
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:02 AM
చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, కుర్రకారు గుండెల్లో మిల్కీ బ్యూటీగా నిలిచిపోయిన నటి తమన్నా భాటియా.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, కుర్రకారు గుండెల్లో మిల్కీ బ్యూటీగా నిలిచిపోయిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది, నేటికీ అదే గ్లామర్, అదే ఎనర్జీతో దూసుకుపోతోంది. అయితే, గత కొంతకాలంగా తమన్నా ఫోకస్ పూర్తిగా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. సౌత్ సినిమాలను పక్కన పెట్టి, నార్త్ వైపే మొగ్గు చూపుతుందనే చర్చ ఫిలిం నగర్‌లో జోరుగా సాగుతోంది.
సాధారణంగా హీరోయిన్ల కెరీర్ పదేళ్లు దాటడమే కష్టం. కానీ తమన్నా విషయంలో అది సాధ్యమైంది. ఆమె కెరీర్ ఎప్పుడు డౌన్ అవుతుందో అనిపించిన ప్రతిసారీ, ఒక భారీ కమర్షియల్ హిట్ తోనో లేక ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ తోనో మళ్ళీ ఫామ్ లోకి రావడం ఆమెకే దక్కింది. టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా ప్లాన్డ్ గా లీడ్ చేస్తోంది. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, ఓటీటీ వేదికల పైన కూడా తన సత్తా చాటుతోంది.
ప్రస్తుతం తమన్నాకు సౌత్‌లో ఆఫర్లు తగ్గాయా? లేక ఆమె కావాలనే తగ్గించుకుందా? అంటే.. బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ ఆఫర్లే దీనికి సమాధానం. సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ లో తమన్నాకు భారీగా రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. అక్కడ కేవలం సినిమాలే కాకుండా, వెబ్ సిరీస్ లలో కూడా బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటోంది. అందుకే ఇప్పుడు ఆమె పూర్తి ఎఫర్ట్ ను బాలీవుడ్ పైనే పెడుతోంది. హిందీ ఆడియన్స్‌లో కూడా ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండడం విశేషం.
నిజానికి సౌత్ లో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ కు కొత్త ఊపిరి పోసింది తమన్నా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐటంపాటలతో ఆమె సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో ఎంతమంది ఐటమ్ భామలు ఉన్నా, తమన్నా గ్రేస్ మరియు డ్యాన్స్ ముందు వారందరూ దిగదుడుపే అని అక్కడి మేకర్స్ భావిస్తుంటారు. అందుకే బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ కోసం మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ మిల్కీ బ్యూటీనే. క్రేజ్ పరంగా చూస్తే అక్కడ ఆమెకే ఎక్కువ ఓటింగ్ పడుతోంది. సందర్భాన్ని బట్టి కొన్ని సినిమాలను వదులుకుంటూ, మరికొన్నింటిని ఎంచుకుంటూ కెరీర్ ను ఫుల్ స్వింగ్ లో ముందుకు తీసుకెళ్తోంది తమన్నా. మరి రానున్న రోజుల్లో అయినా తమన్నా సౌత్‌లో పూర్తి స్థాయిలో సినిమా చేస్తుందో లేదో చూడాలి.