చిరుత పాప.. ఇంత బోల్డ్ గా చూపిస్తే ఎలా.. అబ్బాయిలు ఆగేదేలా

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:04 PM

నేహా శర్మ (Neha Sharma).. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో అమ్మడు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Neha Sharma

నేహా శర్మ (Neha Sharma).. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో అమ్మడు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కిర్రెక్కించిన ఈ భామ ఆ తరువాత పలు సినిమాలు చేసినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లకు డబ్బు, పేరు సంపాదించుకోవడానికి సినిమాలే ఉండాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ఫోటోలు, వీడియోలు పెడితే చాలు. సబ్స్క్రిప్షన్ రూపంలో నెలకు లక్షలు సంపాదించొచ్చు. అదే పనిని వృత్తిగా మార్చుకొన్న హీరోయిన్స్ లో నేహా శర్మ కూడా ఒకరు.


నిత్యం హాట్ హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ.. తన సబ్స్క్రైబర్స్ ని మనసులను దోచుకుంటూ ఉంటుంది. పండగ అయినా.. పబ్బం అయినా.. పార్టీ అయినా.. అకేషన్ ఏదైనా .. అమ్మడి ఫోటోస్ లలో అందాల ఆరబోత ఉండాల్సిందే. ఇక ఈ చిన్నదానికి తోడు ఆవిడ చెల్లి కూడా యాడ్ అయ్యింది. ఈ శర్మ సిస్టర్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి కనిపించారు అంటే.. ఇక కుర్రాళ్లకు పండగే. అందాల అరబోతలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతూ ఉంటారు.


తాజాగా నేహా శర్మ తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవులలో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు, అప్‌డేట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులకు స్వీట్ అండ్ హాట్ బర్త్‌డే ట్రీట్ ఇస్తూ, మాల్దీవుల బీచ్ వైబ్స్ మధ్య ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ ఒక బోల్డ్ వీడియోని పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బర్త్‌డే ఫోటోలలో నేహా శర్మ మరింత హాట్‌గా, సిజ్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసింది. వెకేషన్ మూడ్‌లో చిల్ అవుతూ ఆమె ఇచ్చిన ఫోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన ఫ్యాన్స్.. నేహా ఇంత బోల్డ్ గా కనిపిస్తే అబ్బాయిలు ఏమైపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2026 | 06:04 PM