సెట్‌లో అవమానించారు.. దర్శకులతో చాలా ఇబ్బంది పడ్డా..

ABN , Publish Date - Feb 09 , 2026 | 07:04 PM

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపైనా ప్రేక్షకులను అలరించారు నీనా గుప్తా (Neena Gupta) ‘ఇష్క్‌’, ‘ఎలోన్‌’,  ‘ముల్క్‌’, ‘83’, ‘డయల్‌ 100’, ‘గుడ్‌ బై’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.


వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపైనా ప్రేక్షకులను అలరించారు నీనా గుప్తా (Neena Gupta) ‘ఇష్క్‌’, ‘ఎలోన్‌’,  ‘ముల్క్‌’, ‘83’, ‘డయల్‌ 100’, ‘గుడ్‌ బై’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే సీరియళ్లలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ మధ్యకాలంలో ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల(Neena Gupta struggles) గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు వెల్లడించారు. కథల ఎంపిక, కొన్ని పాత్రలు తనను ఆందోళనకు గురి చేశాయన్నారు.

నీనా గుప్తా మాట్లాడుతూ ‘నేను చేసిన కొన్ని పాత్రల విషయంలో చాలా బాధపడ్డాను. నేను ప్రధాన పాత్రలో చేసిన కొన్ని సినిమాలు విడుదల కాకూడదని కోరుకున్నా. షూటింగ్‌ అయిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత వీటిని ఎందుకు అంగీకరించానా అని ఆలోచించి నాలో నేనే బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. సెట్‌లో నన్ను ఎంతో అవమానించారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా నన్ను అసభ్యపదాలతో తిట్టారు. ఆ చిత్రాలు నేను ఇష్టంతో చేయలేదు. కేవలం నాకు డబ్బు అవసరం కాబట్టి చేశాను. ఒకవేళ ఆ సమయంలో వేరే చిత్రాల్లో అవకాశం వచ్చి ఉంటే నేను వీటిలో నటించేదాన్ని కాదు’ అని అన్నారు.

 

 

Updated Date - Feb 09 , 2026 | 11:17 PM