కహానీ 3.. విద్యా బాలన్ ప్లేస్‌లో
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:31 PM
బాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ కహానీ (Kahaani). విద్యా బాలన్ (Vidya Balan) కథానాయకిగా వచ్చిన కహానీ, కహానీ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడమే కాకుండా ప్రేక్షకులను గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్, ఊహించని ట్విస్టులతో విపరీతంగా ఆకట్టుకున్నాయి.
బాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ కహానీ (Kahaani). విద్యా బాలన్ (Vidya Balan) కథానాయకిగా వచ్చిన కహానీ, కహానీ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడమే కాకుండా ప్రేక్షకులను గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్, ఊహించని ట్విస్టులతో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో భాగం కహానీ 3 (Kahaani 3) రూపుదిద్దుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తొలి రెండు చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు సుజోయ్ ఘోష్ (Sujoy Ghosh) ఈ మూడో భాగానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు.
అయితే ఈసారి ఈ ఫ్రాంచైజ్‌లో విద్యా బాలన్ నటించడం లేదని తెలుస్తోంద. నిజం చెప్పాలంటే ఈ రెండు భాగాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈసారి ఆమె లేదు అని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఆమె స్థానంలో ఎవరు నటిస్తున్నారు అంటే.. నేషనల్ అవార్డు గ్రహీత, హీరోయిన్ యామీ గౌతమ్ (Yami Gautam) ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు యామీ పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. నేషనల్ అవార్డు వచ్చాక ఆమె రేంజ్ మారిపోయింది. యామీ ఎంట్రీ కహానీ 3 రేంజ్ ని కూడా మార్చేసింది.
ఇక ఈ చిత్రం పాత కథల కొనసాగింపు కాకుండా.. కహానీ ప్రపంచంలో నడిచే ఒక కొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రేక్షకులు ఇష్టపడే ఆ సీట్-ఎడ్జ్ థ్రిల్‌ను అలాగే ఉంచుతూనే, యామీ గౌతమ్ క్యారెక్టర్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఈ విషయం తెలియడంతో యామీ ఫ్యాన్స్ .. బాక్సాఫీస్ దగ్గర ఇక విధ్వంసమే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందని, త్వరలోనే షూటింగ్ షెడ్యూల్స్, మిగతా నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి యామీ.. విద్యాబాలన్ ని మరిపిస్తుందా లేదా అనేది చూడాలి.