Mumtaz Vs Hema Malini: హేమమాలిని కంటే.. నాకే ఎక్కువ అవార్డులు

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:13 AM

అలనాటి బాలీవుడ్‌ అగ్రతారలు ముంతాజ్ (Mumtaz), హేమమాలిని (Hema Malini) మధ్య 1970ల్లో నంబర్‌ వన్‌ స్థానం కోసం తీవ్ర పోటీ ఉండేదన్న విషయం తెలిసిందే.

Mumtaz Vs Hema Malini

అలనాటి బాలీవుడ్‌ అగ్రతారలు ముంతాజ్ (Mumtaz), హేమమాలిని (Hema Malini) మధ్య 1970ల్లో నంబర్‌ వన్‌ స్థానం కోసం తీవ్ర పోటీ ఉండేదన్న విషయం తెలిసిందే. అయితే దశాబ్దాల తర్వాత ఆ పోటీకి సంబంధించిన చర్చ మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. హేమమాలిని కంటే తనకే ఎక్కువ అవార్డులు వచ్చాయని, తాను తిరస్కరించిన సినిమాల్లో నటించడం వల్లే హేమమాలినికి ఆ అవార్డులు దక్కాయనీ ఓ ఇంటర్వ్యూలో ముంతాజ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ధర్మేంద్ర (Dharmendra) మరణించిన దుఃఖంలో హేమమాలిని ఉండగా ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతూ నెటిజన్లు ముంతాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముంతాజ్‌ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు.

hema.jpg

నేను తిరస్కరించిన సినిమాలకే.. అవార్డులు

‘ఒక జర్నలిస్ట్‌ ఇంటర్వ్యూలో నన్ను హేమమాలినితో పోల్చి తక్కువ చేయడం వల్లే నన్ను నేను సమర్థించుకోవాల్సి వచ్చింది. ‘మీకన్నా హేమమాలినికే ఎక్కువ అవార్డులు వచ్చాయి’ అంటూ ఆ జర్నలిస్ట్‌ మరొక నటితో పోల్చి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే మౌనంగా ఉండలేను కదా. ‘నాకు కూడా చాలా అవార్డులు వచ్చాయి. కావాలంటే లెక్కపెటి ్ట చూసుకోండి’ అని చెప్పాను. నేనేం తప్పు మాట్లాడలేదు కదా?’ అని ప్రశ్నించారు.

‘నేను తిరస్కరించిన సినిమాలకే హేమమాలినికి అవార్డులు వచ్చాయి. ఆ రోజుల్లో నేను షమ్మీకపూర్‌తో సినిమాలు చేయడం మానేశాను. ఆయనతో చేయాల్సిన రెండు సినిమాలను వదులుకున్నాను. ఆ తర్వాత హేమాజీని తీసుకున్నారు. నేను వదులుకున్నవే ఆమెకు వరాలయ్యాయి నేను వదులుకొన్న సినిమాల్లో నటించి ఎంతోమంది హీరోయిన్లు అవార్డులు తీసుకున్నారు. లెక్క తీస్తే అసలు విషయం తెలుస్తుంది. నేను అహంకారిని కాను. కానీ ఎవరైనా రెచ్చగొడితే, ఊరుకోను’ అని ముంతాజ్‌ వివరణ ఇచ్చారు.

Updated Date - Jan 05 , 2026 | 09:32 AM