మొన్న ధనుష్ ..నిన్న శ్రేయాస్... నేడు యశస్వీ.. మృణాల్ ప్రేమాయణం

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:56 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎవరితోనైనా కలిసి ఒక ఈవెంట్‌లోనో లేక కేఫ్‌లోనో కనిపిస్తే చాలు.. వెంటనే డేటింగ్ అంటూ పుకార్లు షికార్లు చేయడం కామన్ అయిపోయింది. అయితే, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) విషయంలో మాత్రం ఈ తరహా రూమర్స్ విపరీతంగా రావడం విశేషం.

Mrunal Thakur

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎవరితోనైనా కలిసి ఒక ఈవెంట్‌లోనో లేక కేఫ్‌లోనో కనిపిస్తే చాలు.. వెంటనే డేటింగ్ అంటూ పుకార్లు షికార్లు చేయడం కామన్ అయిపోయింది. అయితే, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) విషయంలో మాత్రం ఈ తరహా రూమర్స్ విపరీతంగా రావడం విశేషం. మొన్నటికి మొన్న తమిళ స్టార్ ధనుష్‌తో లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరిగింది. ధనుష్ తో పెళ్లివరకు ఆ రూమర్స్ వెళ్ళాయి. ఏదో విధంగా ఆ రూమర్స్ కి చెక్ పడ్డాయి అంటే.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో ముడిపెట్టారు.. అది కూడా ఫేక్ అని తెలిసింది. ఇక ఇప్పుడు క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌తో (Yashasvi Jaiswal) మృణాల్ ప్రేమాయణం నడిపిస్తోందని సోషల్ మీడియాలో కథనాలు అల్లేస్తున్నారు.


ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ కేఫ్ వద్ద యశస్వీ జైస్వాల్, మృణాల్ ఠాకూర్ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని పుకార్లు పుట్టాయి. 33 ఏళ్ల మృణాల్.. కేవలం 24 ఏళ్ల యశస్వీతో ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్ నడిచింది. అయితే అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు అని పలువురు చెప్పుకొస్తున్నారు. కేఫ్ వద్ద యశస్వీ జైస్వాల్, మృణాల్ ఠాకూర్ కనిపించిన మాట వాస్తవమే కానీ వారిద్దరూ వేరువేరుగా కనిపించారు. మృణాల్ రాకముందే యశస్వీ ఆ కేఫ్ లో ఉన్నాడని, అతను తన పని అయ్యాక వెళ్లేటప్పుడు తీసిన వీడియో.. మృణాల్ వచ్చిన వీడియో రెండు ఎడిట్ చేసి పెట్టారని సమాచారం. వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని స్పష్టమయ్యింది.


సినిమా పరిశ్రమలో ఒక నటి ప్రొఫెషనల్ పనిమీద కనిపించినా, రోజుకో పేరుతో ఇలాంటి లింక్-అప్‌లు రాయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్, శ్రేయాస్ అయ్యర్ విషయంలో కూడా ఇలాంటి ఆధారాల్లేని పుకార్లే వచ్చాయని, ఇప్పుడు జైస్వాల్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరితో కనిపించినా డేటింగేనా.. నిజానిజాలు తెలుసుకోరా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి దీనిపై మృణాల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Updated Date - Jul 28 , 2026 | 04:04 PM