Mrunal Thakur: సినిమాలు తక్కువ.. గాసిప్స్ ఎక్కువ
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:21 PM
నేటి కాలంలో వెండితెరపై సక్సెస్ సాధించడం ఒక ఎత్తైతే.. సోషల్ మీడియాలో, వార్తల్లో నిలవడం మరో ఎత్తు. సినిమాల కంటే ఎక్కువగా గాసిప్స్‌తోనే ఫేమస్ అవుతున్న హీరోయిన్లు ఈ మధ్యకాలంలో చాలామందే కనిపిస్తున్నారు
నేటి కాలంలో వెండితెరపై సక్సెస్ సాధించడం ఒక ఎత్తైతే.. సోషల్ మీడియాలో, వార్తల్లో నిలవడం మరో ఎత్తు. సినిమాల కంటే ఎక్కువగా గాసిప్స్‌తోనే ఫేమస్ అవుతున్న హీరోయిన్లు ఈ మధ్యకాలంలో చాలామందే కనిపిస్తున్నారు. అందులో ఒకరు మన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన రూమర్లతో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అసలు మృణాల్ చుట్టూ తిరుగుతున్న (Gossips Queen Mrunal) ఆ గాసిప్స్ ఏంటి..?
హిందీ సీరియల్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మృణాల్, 'సూపర్ 30' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమెకు అసలైన గుర్తింపు ఇచ్చింది మాత్రం టాలీవుడ్ సెన్సేషన్ 'సీతారామం'. ఈ సినిమాతో తెలుగు కుర్రాళ్ల కలల యువరాణిగా మారిపోయింది. ఆ తర్వాత 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, 'ఫ్యామిలీ స్టార్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, మృణాల్ ఇమేజ్‌కు మాత్రం ఎలాంటి ఢోకా కలగలేదు. ప్రస్తుతం అడివి శేష్‌తో 'డెకాయిట్' మూవీతో పాటు దుల్కర్ సల్మాన్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. సినిమాల విషయంలో మృణాల్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, గాసిప్స్ విషయంలో మాత్రం స్పీడు తగ్గించడం లేదు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె ప్రేమలో ఉందంటూ ఓ పెద్ద చర్చే నడిచింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. అయితే, ఈ వార్తలపై మృణాల్ స్పందిస్తూ.. ధనుష్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. అయినప్పటికీ, ఆ గాసిప్ మృణాల్‌కు ఫుల్ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ధనుష్ వ్యవహారం సద్దుమణిగింది అనుకునేలోపే.. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేదితో మృణాల్ ఎఫైర్ నడిపిస్తోందనే వార్తలు బి-టౌన్‌లో షికారు చేస్తున్నాయి.
వీరిద్దరూ క్లోజ్‌గా కనిపిస్తున్నారని, త్వరలోనే ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇది పబ్లిసిటీ స్టంటా లేదా నిజంగానే వీరి మధ్య ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా, సినిమాల కంటే కూడా ఈ తరహా ప్రచారాలే ఆమెకు సోషల్ మీడియాలో మరింత బూస్టప్ ఇస్తున్నాయి. ప్రస్తుతం మృణాల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ, క్రేజ్ విషయంలో మాత్రం టాప్‌లో ఉంది. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ తన ఇమేజ్‌ను కాపాడుకుంటోంది. మరి డెకాయిట్ సినిమాతో మృణాల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.