Sunil Thapa: ‘మిరాయ్‌’ నటుడు.. సునీల్‌ థాపా క‌న్నుమూత‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:33 AM

తెలుగు చిత్రం ‘మిరాయ్‌’లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నేపాల్‌ నటుడు సునీల్‌ థాపా(68) ఇకలేరు.

sunil

తెలుగు చిత్రం ‘మిరాయ్‌’లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నేపాల్‌ నటుడు (Nepali Actor) సునీల్‌ థాపా(68) (Sunil Thapa) ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఖాట్మండులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్లపాటు నటుడిగా కొనసాగారు. నేపాలీ, హిందీ, భోజ్‌పురి తదితర భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు.

1981లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘ఏక్‌ ధూజే కే లియే’తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. నేపాలి చిత్రం ‘ఛీనో’లో ‘రెటే కైలా’గా కనిపించి విశేష ఆదరణ దక్కించుకున్నారు. ‘మేరీ కోమ్‌’లో ప్రియాంకకు కోచ్‌ నర్జిత్‌ సింగ్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు.

Updated Date - Feb 08 , 2026 | 05:33 AM