Dashavatar: మరాఠీ సినిమా సంచలనం.. ఆస్కార్ రేసులో దశావతార్
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:02 AM
భారతీయ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరిస్తూ, మరాఠీ చిత్రం ‘దశావతార్’ (Dashavatar ) అరుదైన ఘనతను సాధించింది.
భారతీయ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరిస్తూ, మరాఠీ చిత్రం ‘దశావతార్’ (Dashavatar ) అరుదైన ఘనతను సాధించింది. 2026 ఆస్కార్ (Oscars 2026) అవార్డుల (98వ అకాడమీ అవార్డ్స్) పోటీలో నిలిచేందుకు అర్హత సాధించిన చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం, నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ప్రకటించాయి.
మరాఠీ సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ‘దశావతార్’ రికార్డులకెక్కింది. అంతేకాకుండా అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో ప్రదర్శితం కానున్న తొలి మరాఠీ చిత్రం కూడా ఇదేనని చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు సుబోద్ ఖనోల్కర్ (Subodh Khanolkar) తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది.
![]()