Manjari Fadnis: జాలి, దయ లేకుండా కొట్టి చంపేశారంటూ..
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:52 PM
మంజరి ఫడ్నిస్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తాను నివసించే అపార్ట్‌మెంట్‌లో ఓ కుక్కను జాలి, దయ లేకుండా కొట్టి చంపేశారంటూ మంజరి ఫడ్నిస్ ఆవేదన వ్యక్తం చేశారు
'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' హీరోయిన్ మంజరి ఫడ్నిస్ గుర్తుందా? బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఆమె వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తాను నివసించే అపార్ట్‌మెంట్‌లో ఓ కుక్కను జాలి, దయ లేకుండా కొట్టి చంపేశారంటూ మంజరి ఫడ్నిస్ (Manjari Fadnis) ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుస్తున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
కొన్నేళ్ల క్రితం ఎవరో వచ్చి మా సొసైటీలో ఓ కుక్కని వదిలివెళ్లారు. అప్పటినుంచి దాన్ని ‘మైకీ’ అని పేరుతో మేమే పెంచుకుంటున్నాం. కొన్ని రోజుల నుంచి అది కనిపించకపోవడంతో పోస్టర్లు వేసి వెతికాము. ఈ క్రమంలో సొసైటీకి చెందిన ఓ వ్యక్తి దానిని కిరాతకంగా కొట్టి చంపేశారని తెలిసింది. జంతు హింసకు పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మంజరి వీడియో చూసిన భూమి పెడ్నేకర్‌తో పాటు మరికొందరు స్పందించారు.