పవర్‌ఫుల్‌ కాంబోలో ‘లాహోర్‌ 1947’

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:37 PM

బాలీవుడ్‌ మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)నిర్మిస్తోన్న పీరియడ్‌ డ్రామా ‘లాహోర్‌ 1947’ (lahore 1947). రాజ్‌కుమార్‌ సంతోషి (Raj Kumar santhoshi) దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్‌ మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)నిర్మిస్తోన్న పీరియడ్‌ డ్రామా ‘లాహోర్‌ 1947’ (lahore 1947). రాజ్‌కుమార్‌ సంతోషి (Raj Kumar santhoshi) దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ డియోల్‌, షబానా ఆజ్మీ, మిథున్‌ చక్రవర్తి, ప్రీతి జింటా, అభిమన్యు సింగ్‌, కరణ్‌ డియోల్‌, అలీ ఫజల్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంబంధించి ఆమిర్‌ ఖాన్‌ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Lahore 1947
ఈ ఏడాది ఆగస్టు 13న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఆమిర్‌ఖాన్‌, సన్నీ డియోల్‌, రాజ్‌కుమార్‌ సంతోషి కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. ఇదొక పవర్‌ఫుల్‌ సినిమా కానుంది' అని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 09:37 PM