Kriti Sanon: హీరోయిన్.. రెడీగా ఉందా లేదా చూస్తారు! హీరో రాక ముందే.. సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - May 11 , 2026 | 11:22 AM
పారితోషికం విషయంలో హీరోయిన్లపైనే కోతలు ఎందుకు విధిస్తారని కృతి సనన్ ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలోని అసమానతలు, సెట్స్‌లో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమె స్పందించారు.
‘పారితోషికం విషయంలో ఇప్పటికీ చాలా పోరాటం చేయాల్సి వస్తోంది. నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే..ముందుగా హీరోయిన్ల రెమ్యూనరేషన్లలో కోత విధిస్తున్నారు. బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోకే వెళ్తున్నప్పటికీ, తగ్గించే విషయంలో మాత్రం మా దగ్గరే ప్రారంభిస్తారు. హీరోయిన్లు అంటే ఎందుకు అంత వివక్ష?’ అని ప్రశ్నించారు హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon).
ఇటీవల ఆమె చిత్ర పరిశ్రమలోని అసమానతల గురించి మాట్లాడారు. సెట్స్‌లో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సెట్‌లోకి హీరో రాకముందే హీరోయిన్ రెడీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు. హీరో వేచి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.