విజయ దేవరకొండతో మహేశ్ హీరోయిన్ రొమాన్స్!
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:22 PM
'వన్ నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి ససన్ ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించబోతోంది. విజయ్ దేవరకొండ - శౌర్యవ్ మూవీలో కృతిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న 'రణబాలి', 'రౌడీ జనార్దన్' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇవి పూర్తి కాకముందే విజయ్ దేవరకొండ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. వైరా సంస్థ నిర్మించే ఈ సినిమా పూజాకార్యక్రమాలు సైతం ఇటీవల మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో కృతి సనన్ తెలుగు సినిమా 'వన్ నేనొక్కడినే'లో మహేశ్ బాబు సరసన నటించింది. ఆమె ఆమెకు తొలి తెలుగు సినిమా. ఆ తర్వాత నాగచైతన్య సరసన 'దోచెయ్' మూవీలో నటించింది. అలానే కొన్నేళ్ళ క్రితం తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'లోనూ నటించింది. గడిచిన పదేళ్ళలో హిందీలో విరివిగా సినిమాలు చేయడంతో పాటు ఇటీవల ఆమె ఓ సినిమాను నిర్మించింది కూడా. తెలుగులో చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కృతి సనన్... విజయ్ దేవరకొండ, శౌర్యవ్ మూవీ చేయడానికి అంగీకరించడం ఆసక్తికరంగా మారింది. అయితే... కృతి సనన్‌ను ఎంపిక చేసుకున్నట్టుగా వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, అధికారికంగా చిత్ర బృందం ప్రకటించేవారకూ దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని కొందరంటున్నారు.
ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్' వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్' చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. 'యానిమల్, ఓం శాంతి ఓం' వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్న కృతి సనన్ 'ఆదిపురుష్' చిత్రంలో సీతాదేవిగా నటించి మెప్పించింది.