Kiara Advani: నా కూతురికి ఒక్క మగాడితోనే ఉండు అని చెప్పను
ABN , Publish Date - May 17 , 2026 | 06:04 PM
సాధారణంగా ప్రతి తల్లి తన పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విలువలను నేర్పిస్తూ పెంచుతారు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లి అయితే.. ఇండిపెండెంట్ గా ఉండాలి.
సాధారణంగా ప్రతి తల్లి తన పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విలువలను నేర్పిస్తూ పెంచుతారు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లి అయితే.. ఇండిపెండెంట్ గా ఉండాలి. మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. ధైర్యంగా ఉండాలి. ప్రేమ, పెళ్ళి విషయంలో క్లారిటీగా ఉండాలి. జీవితంలో ప్రేమించిన అబ్బాయినే పెళ్ళాడాలి అని నేర్పిస్తారు. కానీ, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) మాత్రం.. తన కూతురు డేటింగ్ విషయంలో ఆమెకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పుకొచ్చింది. ఒక్క అబ్బాయిని డేట్ చేస్తే అతడినే పెళ్లి చేసుకోవాలి అనే మాటలు చెప్పను అని చెప్పి షాక్ ఇచ్చింది.
అందాల భామ కియారా అద్వానీ, నటుడు సిద్దార్థ్ మల్హోత్రా కొన్నేళ్లు ప్రేమించుకొని 2023 లో పెళ్ళి చేసుకున్నారు. ఈ జంటకు సరయా అనే పాప ఉంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోన్న కియారా తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో కూతురు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బేబీ పుట్టాకా తనకు ప్రపంచమే తెలియడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ జనరేషన్ లో అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా ఉంటున్నారో అందరికి తెలుసు.. మీ కూతురుకు సమాజంలో ఉన్న అబ్బాయిల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న ప్రశ్నకు కియారా ఇచ్చిన సమాధానం పెద్ద దుమారాన్నే రేపింది.
' నా కూతురుకు నేను ఒకటే చెప్తాను. ఒక్క అబ్బాయితోనే డేటింగ్ చెయ్, పెళ్లి చేసుకో అని మాత్రం చెప్పను. ఒక్క మగాడితో డేటింగ్ చేసి.. అతడినే పెళ్ళి చేసుకోవాలని రూల్ లేదు. నాకు అలానే జరిగింది. తను ఫుల్ లైఫ్ చూడాలని కోరుకుంటున్నాను. తన ఇష్టం.. ఎవరైనా అబ్బాయి నచ్చితే పెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే లేదు. రిలేషన్ షిప్ విషయంలో పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎదిగే క్రమంలో అవే వారికి పాఠాలు నేర్పిస్తాయి. జీవితాన్ని అందరు పూర్తిగా అనుభవించాలి. లైఫ్ లో ఎన్నో తప్పులు చేస్తాం. వాటినుంచి ఎన్నో నేర్చుకోవాలి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.