యశ్ తో కియారా ఇంటిమేటెడ్ సీన్స్.. సిద్దార్థ్ ఏమన్నాడంటే
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:18 PM
సాధారణంగా పెళ్లి తరువాత హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇండస్ట్రీ వేరు.. విధానాలు వేరు. పెళ్లి అయినా కాకపోయినా హీరోయిన్లు అందాల ఆరబోతకు ఎప్పుడు వెనుకాడడం లేదు.
సాధారణంగా పెళ్లి తరువాత హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇండస్ట్రీ వేరు.. విధానాలు వేరు. పెళ్లి అయినా కాకపోయినా హీరోయిన్లు అందాల ఆరబోతకు ఎప్పుడు వెనుకాడడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలకు పెళ్లితో పనే లేదు. అలా పెళ్లి తరువాత ఇంటిమేటెడ్ సీన్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో మారింది అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani). పాన్-ఇండియా స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ (Toxic) చిత్రంలో అమ్మది బోల్డ్ సీన్స్ చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక ఈ సినిమాలో యశ్ తో బోల్డ్ సీన్స్ చూసి తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా అస్సలు పట్టించుకోలేదని కియారా చెప్పుకొచ్చింది. ఈ జంట తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కరణ్.. పెళ్లి తరువాత బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, విమర్శల గురించి కియారాని సూటిగా అడిగాడు. దానికి ఆమెకూడా చాలా క్లియర్ గా సమాధానం చెప్పింది. 'సిద్ధూ చాలా పరిణితి కలిగిన వ్యక్తి. అలాంటివి మా ఆయన అస్సలు పట్టించుకోడు. మా పెళ్లి తర్వాత ఈ విషయంపై మేమిద్దరం అసలు చర్చించుకోలేదు, ఆయనకు దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదు. దశాబ్దాలుగా హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటూనే ఉన్నారు' అని చెప్పుకొచ్చింది.
ఇక టాక్సిక్ బాక్సాఫీస్ ఫలితంపై కియారా అద్వానీ మాట్లాడుతూ భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, మొదటి రోజే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడం తనతో పాటు చిత్రబృందాన్ని తీవ్రంగా బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి వారం ఈ ఫలితం తనను ఎంతో కుంగదీసిందని, అయితే తన కంఫర్ట్ జోన్‌ను దాటి కెరీర్లోనే ఒక ఛాలెంజింగ్, కీలకమైన పాత్రను పోషించినందుకు వ్యక్తిగతంగా తన నటనకు ఎంతో ప్రశంసలు లభించడం ఊరటనిచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కియారా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ముందు ముందు కియారా ఎలాంటి సినిమాలను చేస్తుందో చూడాలి.