కియారా: పాపను వదిలి వస్తున్నాను అంటే.. అది ఎంత గొప్పగా ఉండాలి..

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:26 AM

కియారా అడ్వానీ (Kiara adwani).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, 'గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించారామె.

కియారా అడ్వానీ (Kiara adwani) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, 'గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఆమె కన్నడ స్టార్‌ యశ్‌తో 'టాక్సిక్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం గురించి కొన్ని హింట్స్‌ ఇచ్చింది. ‘టాక్సిక్‌ (Toxic) నా కెరీర్‌కు భిన్నమైన సినిమా కాబోతోంది. ప్రతిభావంతులైన యశ్‌, గీతూ మోహన్‌ దాస్‌ విజన్‌లో భాగం కావడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి ఏమీ చెప్పలేను’ అని అన్నారు.

kiara.jpg

అలాగే సినిమాల ఎంపిక గురించి కూడా మాట్లాడారామె! ‘నేను ఓ సినిమా అంగీకరించాను అంటే అందులో క్వాలిటీ ముఖ్యంగా చూస్తా. వృత్తి అయినా, వ్యక్తిగత జీవితం అయినా పక్కాగా ప్రణాళిక వేసుకుంటా. ఈ మధ్యకాలంలో డేట్స్‌ సర్దుబాటు కాక, ప్రాధాన్యం మారడం వల్లో కొన్ని ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకొన్నా. అయితే దాని వల్ల నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పుడు నా సమయం చాలా విలువైనది. ఇంటి దగ్గర చిన్నారిని వదిలి షూటింగ్‌కు వస్తున్నానంటే, నేను చేసే సినిమా అంతకంటే గొప్పగా ఉండాలి. అందుకే ఇప్పుడు మరింత క్వాలిటీ ఉండే కథలే ఎంచుకుంటున్నాను. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా, నటిగా నన్ను నేను సవాల్‌ చేసుకునే పాత్రలు చేయాలని ఉంది’ అని మనసులోని మాటను బయటపెట్టారు కియారా.

Updated Date - Apr 06 , 2026 | 01:07 PM