Katrina Kaif: సీక్వెల్‌ సినిమాతో కత్రినా రీ ఎంట్రీ..

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:16 PM

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ తెరపై కనిపించి రెండేళ్లు కావొస్తుంది. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘మేరీ క్రిస్టమస్‌’ తర్వాత ఆమె నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

Katrina Kaif

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ (Katrina kaif) తెరపై కనిపించి రెండేళ్లు కావొస్తుంది. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘మేరీ క్రిస్టమస్‌’ తర్వాత ఆమె నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. 2025 నవంబర్‌లో ఆమె తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కూడా ఆమె సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం. అయితే కత్రినా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమంటూ బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. టబు ప్రధాన పాత్రలో 2001లో వచ్చిన ‘చాందినీ బార్‌’ (Chandini Bar) సీక్వెల్‌లో కత్రినా కథానాయికగా నటించనుందట. ఈ మధుర బండార్కర్‌ ‘చాందినీ బార్‌’ను తెరకెక్కించారు. ఇందులో టబు నటనకు ఫ్యాన్‌ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది.

గతేడాది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ‘సెక్షన్‌ 375’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ బహల్‌ ‘చాందినీ బార్‌ 2’కు దర్శకత్వం వహించనున్నారు. అయితే, ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని నిర్మాణ సంస్థ అప్పుడు ప్రకటించలేదు. ఇప్పుడు ఆ అవకాశం కత్రినాను వరించినట్లు బాలీవుడ్‌ మీడియా ప్రచారం చేస్తోంది. అదే నిజమైతే కత్రినా రీ ఎంట్రీ ఖాయమే!

Updated Date - Jun 12 , 2026 | 06:20 PM