రాహుల్ గాంధీతో కంగనా పెళ్ళి.. సిగ్గుండాలి
ABN , Publish Date - May 05 , 2026 | 03:21 PM
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణమే. హీరో,హీరోయిన్ సినిమాలో కాకుండా బయట కలిసి కనిపిస్తే చాలు వారిద్దరూ పెళ్ళి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టించేస్తారు.
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణమే. హీరో,హీరోయిన్ సినిమాలో కాకుండా బయట కలిసి కనిపిస్తే చాలు వారిద్దరూ పెళ్ళి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టించేస్తారు. అదంతా కామనే. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) పెళ్ళి పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో కంగనా పెళ్ళి అంటూ కొన్నిరోజులుగా బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది.
రాహుల్ గాంధీనే.. కంగనాకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడని, వెంటనే కంగనా కూడా ఆ ప్రపోజల్ ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి పుకార్లను పట్టించుకోరు. కానీ, ఫైర్ బ్రాండ్ కంగనా మాత్రం ఈ రూమర్స్ పై మండిపడింది. సిగ్గుండాలి ఇలాంటి వార్తలు పుట్టించడానికి అంటూ ఘాటుగా స్పందించింది. ' ఇలాంటి అసత్య వార్తలను ప్రచురించేవారికి కనీసం సిగ్గుండాలి. నా పేరును ఇలాంటి వార్తలను పుట్టించడానికి వాడడం ఒక నీచమైన చర్య. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పుకార్లు పుట్టించేవారికి బాధ్యత లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.
సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఎవరో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ పుకార్లు నన్నే కాదు.. అవతలి వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఈమధ్య ఇలాంటి పుకార్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అనేసరికి నిమిషాల్లో వైరల్ చేస్తున్నారు. దానివల్ల ఆ వార్తల్లో నిలిచినవారు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. అధికారికంగా వచ్చే వార్త తప్ప ప్రజలు ఏది నమ్మవద్దు. ఇలాంటి అసత్యప్రచారాలు ఆపడానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనుకాడనని' కంగనా తెలిపారు.