Janhvi Kapoor: మొన్నేమో ఎన్టీఆర్ జపం చేసింది.. ఇప్పుడు ఎవరిని పడుతుందో

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:56 PM

అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Janhvi Kapoor

అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నెపో కిడ్ గానే వరుస సినిమా ఛాన్స్ లు పట్టినా తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ, ఈ తంగమ్, అందాల అరబోతతో ట్రోలింగ్ మెటీరియల్ గా నిలిచింది. కనీసం, రెండో సినిమా పెద్దితో అయినా మంచి నటనను కనబరుస్తుంది అనుకుంటే.. అది కూడా అమ్మడిని నిరాశపర్చింది.


సినిమాలు పరాజయాన్ని అందుకోవడం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో జాన్వీపై నెగిటివ్ ట్రోల్ ఏ రేంజ్ లో వచ్చిందో అందరికీ తెల్సిందే. ఈ దెబ్బతో అమ్మడు తెలుగు సినిమాలు వదిలేసి ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీని కాకా పడుతోంది. తాజాగా తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి పాల్గొన్న ఒక ప్రత్యేక చిట్‌చాట్ ఇంటర్వ్యూలో జాన్వీ తమిళ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళ పరిశ్రమలోని దర్శకులు, నటీనటులు, అక్కడి సినిమాలపై తనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ఆమె ఈ సందర్భంగా బయటపెట్టింది.


ఈ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తాను ఇటీవల విడుదలైన తమిళ చిత్రం బ్లాస్ట్ చూశానని, అందులో కథానాయిక ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చింది. అలాగే యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరిచే ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోలకు తాను పెద్ద అభిమానినని, ముఖ్యంగా తమిళ నేటివిటీని, వాస్తవికతను ప్రతిబింబించే ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తెరకెక్కించే విలక్షణమైన కథలు తనను బాగా ఆకట్టుకుంటాయని జాన్వీ స్పష్టం చేసింది.


అంతేకాకుండా, దళపతి విజయ్ నటించిన పోకిరి వంటి పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలను కూడా తాను ఎంతగానో ఆస్వాదిస్తానని తెలిపింది. తన తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించిన, రీమేక్ చేసిన తమిళ సినిమాలను తాను క్రమం తప్పకుండా చూస్తుంటానని ఆమె చెప్పుకొచ్చింది. జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇది కేవలం తమిళ సినిమాలపై ఆమెకున్న సాధారణ ఆసక్తా? లేక కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు వేస్తున్న ముందస్తు వ్యూహమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి మొదట ఎన్టీఆర్ తోనే చేయాలని దేవుడికి పూజలు చేశానని చెప్పి అప్పుడు కాక పట్టిన ఈ భామ ఇప్పుడు కాలీవుడ్ లో ఏ హీరోని పడుతుందో చూడాలి.

Updated Date - Nov 08 , 2026 | 05:10 PM