స్మిత్ మచ్చర్ కోసం ఇజ్రాయెల్ గాయకుడి హనుమాన్ చాలీసా
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:35 PM
ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, అసాధారణ ధైర్యసాహసాలతో ప్రయాణికులను కాపాడేందుకు పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, అసాధారణ ధైర్యసాహసాలతో ప్రయాణికులను కాపాడేందుకు పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Smit Machchhar) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఆయన వ్యవహరించిన తీరు ఎంతోమందిని కదిలించింది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన గాయకుడు బెన్ రైవిట్జ్ (Ben Raivitz)సైతం స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ప్రార్థించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ హనుమాన్ చాలీసాను పఠించినట్లు తెలిసి బెన్ రైవిట్జ్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయన స్వయంగా హనుమాన్ చాలీసాను ఆలపిస్తూ ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ కెప్టెన్ స్మిత్‌కు అంకితం చేశారు. ఈ సందర్భంగా స్మిత్‌ను భారత హీరోగా అభివర్ణించిన బెన్ రైవిట్జ్.. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడిన పైలట్ కోసం ఆయన చేసిన ఈ ప్రార్థన పలువురి హృదయాలను తాకుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆపదలో ధైర్యంగా నిలిచిన వ్యక్తి కోసం మరో దేశానికి చెందిన గాయకుడు ప్రార్థించడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. మతం, దేశం, భాష వంటి భేదాలకు అతీతంగా మానవత్వం మనుషులను ఎలా కలుపుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందని నెటిజన్లు పెడుతున్నారు.