అమీర్ ఖాన్ మూడో పెళ్లి చెల్లదు.. ట్విస్ట్ ఇచ్చిన మతగురువు

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:22 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కి ముస్లిం మత గురువు ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ షాక్ ఇచ్చాడు.

Aamir Khan

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కి ముస్లిం మత గురువు ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ షాక్ ఇచ్చాడు. ఇటీవలే అమీర్.. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మతాంతర వివాహం చెల్లదని మత గురువు అమీర్ ఖాన్‌పై ఫత్వా జారీ చేయడం సంచలనంగా మారింది. గౌరీ స్ప్రాట్ ముస్లిం కానందున, షరియా చట్టాల ప్రకారం అమీర్ ఖాన్ చేసుకున్న ఈ మూడవ వివాహం చెల్లదని ఆయన తెలిపుతూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు.


ఆ వీడియోలో ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ మాట్లాడుతూ.. ఒక ముస్లిం పురుషుడు.. వేరే మతం స్త్రీని వివాహం చేసుకోవడం హరామ్. ఒకవేళ ఆ మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే తప్ప, ఆమెను వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి చేసుకునే ముస్లింలు పాపం చేస్తున్నట్లే. పెళ్లి వల్ల వచ్చే కనీస బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు మరొక వివాహం చేసుకోకూడదు. ఇలాంటి వివాహం చెల్లదు. మేము ఆమోదించం' అని ఆయన తెలిపాడు. ఇక ఈ వ్యాఖ్యలపై నటుడు అమీర్ ఖాన్ కానీ, ఆయన భార్య గౌరీ స్ప్రాట్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


అమీర్ ఖాన్ గత వివాహాల విషయానికి వస్తే.. ఆయన మొదట రీనా దత్తాను వివాహం చేసుకోగా, వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకుని సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్‌కు జన్మనిచ్చారు. 2021లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించినా, తమ కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జూలై 5, 2026న ముంబైలోని తన నివాసంలో అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నాడు.

Updated Date - Jul 15 , 2026 | 04:23 PM