గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కండల వీరుడు.. ఆ వ్యాధే కారణం
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:20 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) గురించి తెలుగు ప్రేక్షకలకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ కండల వీరుడుగా ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) గురించి తెలుగు ప్రేక్షకలకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ కండల వీరుడుగా ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీ అయినా.. యాక్షన్ సినిమా అయినా ఆయన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్లూ భాయ్ గురించే చెప్పుకొస్తారు. 60 ఏళ్లు వచ్చినా కండలు తిరిగిన దేహంతో కుర్ర హీరోలకు గుబులు పుట్టించే ఈ కండల వీరుడు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జులై 18న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న స్లమ్ రిహ్యాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆఫీస్‌కు సల్మాన్ విచ్చేశాడు. అక్కడ ఒక కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు, కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించి, 50 మందికి పైగా లబ్ధిదారులకు శాశ్వత గృహాల తాళాల చేతులను ఆయన స్వయంగా అందజేశాడు. ఈ సేవా కార్యక్రమం ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, అక్కడ సల్మాన్ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ తన పర్సనల్ బాడీగార్డ్ షేరా పర్యవేక్షణలో చాలా సింపుల్ దుస్తులలో కనిపించాడు. అయితే, బ్రైట్ లైట్ల మధ్య ఆయన ముఖం చాలా అలసిపోయినట్లు, ముడతలతో కనిపించడమే కాకుండా.. ఆయన చాలా నెమ్మదిగా నడుస్తూ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు, అభిమానులు భాయ్‌జాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. గతంలో ఆయనను వేధించిన ట్రైజెమినల్ న్యూరాల్జియా (ఫేషియల్ నర్వ్ పెయిన్) సమస్య మళ్లీ తిరగబెట్టిందా? లేక వయసు పైబడటం వల్ల వచ్చిన మార్పులా? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు ప్రేక్షకులు మాత్రం.. 60 ఏళ్ల వయసులో ఇలాంటి శారీరక మార్పులు రావడం చాలా సహజమని, స్క్రీన్ మీద కనిపించే సిక్స్-ప్యాక్ రిప్డ్ బాడీకి, రియల్ లైఫ్ రియాలిటీకి చాలా తేడా ఉంటుందని సరిపెట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ, ఇటీవల సల్మాన్ ని ఇలా చూడలేకపోతున్నామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ కిక్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.ఆయన త్వరగా కొలుకొని మళ్లీ మామూలు స్థితికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.