మరో హాలీవుడ్ ఆఫర్ పట్టేసిన లోఫర్ భామ..

ABN , Publish Date - May 12 , 2026 | 05:04 PM

మన స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ ఒకే ఇండస్ట్రీకి పరిమితం కావడానికి ఇష్టపడరు. సౌత్ నుంచి నార్త్‌కు, నార్త్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.

Disha Patani

మన స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ ఒకే ఇండస్ట్రీకి పరిమితం కావడానికి ఇష్టపడరు. సౌత్ నుంచి నార్త్‌కు, నార్త్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ఈ రేసులో ప్రియాంక చోప్రా అందరికంటే ముందు వరుసలో ఉంది. నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నాక గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన పీసీ, ఇప్పుడు 'వారణాసి' చిత్రంతో మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ వైపు చూస్తోంది. మరోవైపు దీపికా పదుకొణె, అలియా భట్ కూడా ఇప్పటికే హాలీవుడ్ ప్రాజెక్టులతో తమ సత్తా చాటారు. ఇప్పుడు వీరి సరసన దిశా పటానీ (Disha Patani) పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కేవలం ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు, ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే..! ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా, కుర్రకారు కలల రాకుమారిగా మారిన దిశా పటానీ ఇప్పుడు తన రూట్ మార్చింది. కేవలం బాలీవుడ్, సౌత్ సినిమాలతోనే సరిపెట్టుకోకుండా.. గ్లోబల్ వైడ్‌గా తన జెండా పాతేందుకు సిద్ధమైంది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె బాటలో నడుస్తూ హాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది.


లేటెస్ట్ సమాచారం ప్రకారం, దిశా పటానీ ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ అనే హాలీవుడ్ చిత్రంలో ఒక కీలక పాత్రకు ఎంపికైంది. ఇది మామూలు సినిమా కాదు.. హై-వోల్టేజ్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. దిశాకు మార్షల్ ఆర్ట్స్ మరియు జిమ్నాస్టిక్స్‌లో మంచి పట్టు ఉంది. అందుకే ఇలాంటి ఫిక్షన్ సినిమాలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని హాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నారట. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో ఇప్పటికే ఇంటర్నేషనల్ బ్రాండ్ల దృష్టిని ఆకర్షించిన దిశా, ఈ సినిమాతో వెస్ట్రన్ ఆడియన్స్‌కు మరింత చేరువ కానుంది. దిశాకు హాలీవుడ్ కొత్తేమీ కాదు. గతంలోనే జాకీచాన్‌ నటించిన కుంగ్ ఫూ యోగా చిత్రంలో అమ్మడు మెరిసింది. కానీ, దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో హాలీవుడ్ కలలను పక్కన పెట్టి మళ్ళీ బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. కల్కి 2898 AD వంటి భారీ ప్రాజెక్టులతో మన దగ్గర క్రేజ్ సంపాదించుకున్న దిశా, ఈసారి మాత్రం హాలీవుడ్‌లో గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయింది.


దిశా కేవలం గ్లామర్ మీద మాత్రమే ఆధారపడటం లేదు. ఆమె ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న వర్కవుట్లు చూస్తుంటే హాలీవుడ్‌లో సెటిల్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. కేవలం అందం ఉంటే సరిపోదు, హాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ స్కిల్స్ ఉండాలి ఇదే సూత్రాన్ని దిశా ఫాలో అవుతోంది. సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు హాలీవుడ్ యూత్‌ను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ పోర్టల్ ఆఫ్ ఫోర్స్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పుతుందా అనేది చూడాలి.

Updated Date - May 12 , 2026 | 05:08 PM