నానా పటేకర్‌లో ఎవరికీ తెలియని టాలెంట్.. జాతీయ షూటింగ్‌లో పతకం, కోహ్లి కోసం భోజనం కూడా మానేసేవారట!
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:54 AM
నటుడు నానా పటేకర్‌కు షూటింగ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన ఆయన విరాట్ కోహ్లికి వీరాభిమాని. ఆయన మృతిపై సచిన్, కోహ్లి సంతాపం తెలిపారు.
దివంగత నటుడు నానా పటేకర్ (Nana Patekar,) ఓ క్రీడాకారుడు కూడా ఉన్నాడు. ఆయన జాతీయస్థాయి షూటింగ్ (Shooting) లో పతకం కూడా సాధించారు. ఇక, క్రికెట్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli)కి వీరాభిమాని కూడా. కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల నానా పటేకర్ గురువారం మరణించారు. ఓ సినిమా కోసం ఆయన మిలటరీ శిక్షణ తీసుకొంటున్న సమయంలో షూటింగ్ పట్ల ఆకర్షితుడయ్యారు.
క్రమంగా ఆటపై దృష్టి కేంద్రీకరించిన పటేకర్ 2004లో ఇండోర్‌లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో రజతం నెగ్గారు. ఇక, 2007లో 300 మీ. బిగ్ బోర్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్యం అందు కున్న మహారాష్ట్ర జట్టులో నానా సభ్యుడు. ఇక క్రికెటర్లలో కోహ్లి అంటే ఎంతో ఇష్టం. అతడు త్వరగా అవుటైతే ఆ రోజు తాను అన్నం తినేవాడిని కాదని ఓ ఇంటర్వ్యూలో పటేకర్ చెప్పారు.
క్రికెటర్ల నివాళి..: నానాకు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), కోహ్లి, శిఖర్ ధవన్ నివాళులర్పించారు. 'భారత సినిమాకు నిజమైన దిగ్గజం' అని విరాట్ ఎక్స్‌లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశాడు. 'నానా మరణవార్త విని ఎంతో బాధపడ్డా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని సచిన్ టెండూల్కర్ అన్నాడు.