‘ధురంధర్‌: ది రివెంజ్‌’ ట్రైలర్‌కు ముహూర్తం కుదిరింది..

ABN , Publish Date - Mar 06 , 2026 | 06:49 PM

గతేడాది వచ్చిన ‘ధురంధర్‌’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.


గతేడాది వచ్చిన ‘ధురంధర్‌’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ (Dhurandhar: The Revenge)  చిత్రం రానుంది. మార్చి 19,న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ గురించి అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 7వ తేది ఉదయం 11:01 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ కొత్త పోస్టర్‌తో వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ బయటకు వస్తే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయని మేకర్స్‌ భావిస్తున్నారు. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో  హై-ఆక్టేన్‌ స్పై-యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జియో స్టూడియోస్‌ సమర్పణలో, బి62 స్టూడియోస్‌ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్‌ధర్‌ నిర్మించారు. ఇందులో ఈ చిత్రంలో రణవీర్‌సింగ్‌ జస్కిరత్‌ సింగ్‌ రంగి, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

dhuradar.jpeg
‘ధురంధర్‌ -1’ ఇండియాతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది.  నార్త్‌ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంచి విజయాన్ని అందుకుంది. గుడి పడ్వా, ఉగాది పండుగల సందర్భంగా  ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ చిత్రం హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. 

Updated Date - Mar 06 , 2026 | 07:16 PM