ధురంధర్ రేంజ్ స్టోరీ.. ఆదిత్య ధర్ నెక్స్ట్ హీరో ఎవరంటే

ABN , Publish Date - May 25 , 2026 | 07:24 PM

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే.. ఆ డైరెక్టర్ తరువాత సినిమా గురించి కొన్నిరోజులు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ ని మాత్రమే కాకూండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar).

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే.. ఆ డైరెక్టర్ తరువాత సినిమా గురించి కొన్నిరోజులు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ ని మాత్రమే కాకూండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar). ధురంధర్ )Dhurandhar) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆదిత్య నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది మిస్టరీగా మారింది.


ఏ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ హిట్ అందుకున్నా సరే అతని నెక్స్ట్ మూవీ ప్రభాస్ తోనే అని టాక్ నడుస్తోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. గత కొన్నిరోజులుగా ఆదిత్య ధర్.. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది రూమర్ అయితే ఓకే కానీ, ఇదే కనుక నిజమైతే మాత్రం డార్లింగ్ ఖాతాలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పడినట్లే. బాక్సాఫీస్ షేక్ అయిన్నట్లే. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.


ఆదిత్య ధర్.. ధురంధర్ లాంటి ఒక రియలిస్టిక్ కథను రాసుకున్నాడట. అది ప్రభాస్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతోందని.. ఆయనకు కథ వినిపించడానికి కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ కథ కనుక డార్లింగ్ కి నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తాడని అంటున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. ఆదిత్య ధర్ కథ వింటాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 25 , 2026 | 07:40 PM