ఓటీటీకి ధురంధర్ 2.. ఎక్కడ చూడొచ్చంటే

ABN , Publish Date - May 08 , 2026 | 04:50 PM

గతేడాది ఇండస్ట్రీని మొత్తం ఒక ఊపు ఊపిన సినిమా ధురంధర్ (Dhurandhar). రణ్వీర్ సింగ్ (Ranveer Singh), సారా అర్జున్ జంటగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Dhurandhar 2

గతేడాది ఇండస్ట్రీని మొత్తం ఒక ఊపు ఊపిన సినిమా ధురంధర్ (Dhurandhar). రణ్వీర్ సింగ్ (Ranveer Singh), సారా అర్జున్ జంటగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్ ది రివెంజ్ ను ఈ ఏడాది రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ధురంధర్ 2.. మార్చి 19 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.


ఈ మధ్యకాలంలో ఏ సినిమా పట్టుమని 10 రోజులు కూడా థియేటర్ లోకి ఉండడం లేదు. చాలా తక్కువ సినిమాలే 50 రోజులు పూర్తిచేసుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ధురంధర్ 2 కూడా చేరింది. తాజాగా ధురంధర్ 2 సినిమా థియేటర్ లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. మొదటి పార్ట్.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


అయితే సెకండ్ పార్ట్ కి మేకర్స్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ధురంధర్ 2 ఒక్క ఓటీటీలో కాదు.. రెండు ఓటీటీలలో రిలీజ్ కానుంది. మే 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఓవర్సీస్ లో స్ట్రీమింగ్ కానుంది. అన్ కట్ వెర్షన్ తో కలిపి 3 గంటల 52 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. ఇండియాలో జియో హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. తెలుగులో కూడా అన్ కట్ వెర్షన్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Updated Date - May 08 , 2026 | 05:26 PM