‘ధురంధర్-2’.. బాహుబలి -2 రికార్ట్స్.. శోభు యార్లగడ్డ రియాక్షన్..
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:35 PM
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్-2’ (Dhurandhar 2) జోరు ఇంకా తగ్గలేదు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల జోరు కొనసాగుతోంది.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్-2’ (Dhurandhar 2) జోరు ఇంకా తగ్గలేదు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా 9 ఏళ్లుగా ఉన్న ‘బాహుబలి 2’ (bahubali 2) రికార్డును ‘ధురంధర్- 2’ అధిగమించిందని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
దీనిపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను ఇటీవల ‘ధురంధర్: ది రివెంజ్’ చూశా. సినిమాను ఎంతో ఎంజాయ్ చేశా. ఈ చిత్రం అన్ని రికారులని బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ నార్త్ అమెరికాలో 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ధురంధర్-2 విడుదలైన పది రోజుల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో రూ.1,226 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో రెండ్రోజులు ఆలస్యంగా వచ్చినా ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది.